ముంబై ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న బ్ర‌హ్మానందం..

256
Brahmanandam

ప్ర‌ముఖ తెలుగు హాస్య‌న‌టుడు బ్ర‌హ్మానందం ఆరోగ్య ప‌రిస్ధితి క్షిణించింది. ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో గ‌త కొద్ది రోజులుగా ఆయ‌న సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయ‌న ప‌రిస్ధితి బాగాలేక‌పోవ‌డంతో ముంబైలోని ఏషియ‌న్ హార్ట్ ఇన్ స్టిట్యూట్ లో బైపాస్ స‌ర్జ‌రీ చేశారు. డాక్ట‌ర్ రామాకాంత్ పండా నేతృత్వంలోని వైద్యబృందం ఆయ‌న‌కు ఆప‌రేష‌న్ చేశార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం స‌క్ర‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తుంది.

మ‌రో 10రోజుల వ‌ర‌కు ఆయ‌న‌ను అబ్జ‌ర్వేష‌న్ లో ఉంచ‌నున్నట్లు తెలుస్తుంది. బ్ర‌హ్మానందం అస్వ‌స్ధ‌త‌కు గుర‌య్యార‌న్న వార్త వినగానే టాలీవుడ్ లోని ప్ర‌ముఖులు షాక్ కు గురయ్యారు. రెండు ద‌శాబ్దాల కాలం నుంచి బ్ర‌హ్మానందం తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌న హాస్యంతో అల‌రిస్తున్నారు. బ్ర‌హ్మానందం తొంద‌ర‌గా కొలుకోవాల‌ని సోష‌ల్ మీడియాలో పొస్ట్ లు పెడుతున్నారు టాలీవుడ్ ప్రేక్ష‌కులు. ఇటివ‌లే విడుద‌లైన ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు చిత్రంలో క‌మెడీయ‌న్ రేలంగా పాత్ర‌లో బ్ర‌హ్మానందం న‌టించిన విషయం తెలిసిందే.