మార్చి 1న శిరీష్ ‘ఎబిసిడి’ విడుద‌ల‌..

185
Allu serish

అల్లు శిరీష్ హీరోగా ఎబిసిడి తెర‌కెక్కుతోన్న విష‌యం తెలిసిందే. నూత‌న ద‌ర్శ‌కుడు సంజీవ్ రెడ్డి ఈసినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత డి.సురేష్ బాబు ఈసినిమాకు స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈసినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ను ఇటివ‌లే విడుదల చేశారు. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఈసినిమాలో శిరీష్ కు తండ్రిగా న‌టిస్తున్నారు. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా ప‌రిచ‌య‌మ‌వుతుంది.

బిగ్ బెన్ సినిమాస్ య‌శ్ రంగినేనితో క‌లిసి మ‌ధుర ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ లో మ‌ధుర శ్రీధ‌ర్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఎబిసిడి మూవీ రిలీజ్ డేట్ ఖ‌రారు చేశారు చిత్ర‌యూనిట్. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మార్చి 1వ తేదిన విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు చిత్ర నిర్మాత‌లు. ఇంత వ‌ర‌కూ అల్లు శిరీష్ కు స‌రైన హిట్ లేక‌పోవ‌డంతో ఈమూవీపై భారీ ఆశ‌లు పెట్టుకున్నాడు శిరీష్. ఈసినిమాతోనైనా శిరీష్ హిట్ కొడ‌తాడో లేదో చూడాలి మ‌రి.