త్వరలో ఏపీకి సీఎం కేసీఆర్…

122
ktr

దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పుకోసం సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ప్రంట్ ఏర్పాటులో భాగంగా ఏపీలో వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యామని తెలిపారు మంత్రి కేటీఆర్. లోటస్‌ పౌండ్‌లో జగన్‌తో భేటీ అనంతరం మీడిమా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్‌…ఒడిశాలో నవీన్ పట్నాయక్,చెన్నైలో స్టాలిన్,కర్ణాటకలో కుమారస్వామి,బెంగాల్‌లో మమతా బెనర్జీతో భేటీ అయ్యారని చెప్పారు.

ఇవాళ కేసీఆర్ ఆదేశాల మేరకు జగన్‌తో భేటీ అయ్యామన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి ఈ సమావేశంలో చాలా విషయాల గురించి చర్చించామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల ఏజెండాగా జాతీయ రాజకీయాలు ఉండాలన్నారు. త్వరలోనే కేసీఆర్‌..అన్నిరాష్ట్రాల ముఖ్యనేతలతో సమావేశం కానున్నారని చెప్పారు. ఏపీలో త్వరలో కేసీఆర్ పర్యటిస్తారని చెప్పారు.

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి,రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలపై ఈ సమావేశంలో చర్చించామన్నారు వైసీపీ అధినేత జగన్‌.ఏపీకి ప్రత్యేక హోదా రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించేందుకు 42 మంది ఎంపీలు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇది స్వాగతించవల్సిన విషయమన్నారు జగన్‌.

కేసీఆర్‌ ప్రతిపాదించిన ఫెడరల్‌ ఫ్రంట్‌కు పూర్తిమద్దతు ఉంటుందని చెప్పారు జగన్‌. త్వరలోనే కేసీఆర్‌తో సమావేశం ఉంటుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా మరింత ముందడుగు పడనుందన్నారు.