సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు- సంతోష్ తల్లిదండ్రులు

278
cm kcr
- Advertisement -

వీరజవాన్ కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి 5 కోట్లు, ఆయన సతీమణికి గ్రూప్ వన్ ఉద్యోగం, ఇంటి స్థలం ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఈ సందర్భంగా సీఎంకు కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కల్నల్ సంతోష్ బాబు తల్లిదండ్రులు ఉపేందర్ ,మంజుల మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు. మా కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది.మనోధైర్యన్నీఇచ్చింది. నా బిడ్డను గుర్తు చేసుకుంటూ యావత్ దేశం గర్విస్తున్నదని వారు తెలిపారు.

- Advertisement -