కల్నల్‌ సంతోష్‌కు పరమవీర చక్ర!

218
santhosh babu
- Advertisement -

చైనాతో జరిగిన ఘర్షణలో మృతి చెందిన తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుకు పరమవీర చక్ర అవార్డు ఇచ్చే యోచనలో ఉంది. సంతోష్ బాబుతో పాటు ఈ దాడిలో మృతి చెందిన 20 మందికి చక్ర అవార్డులను ప్రధానం చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

యుద్ధ స‌మ‌యాల్లో ఇచ్చే చ‌క్ర అవార్డుల్లో.. అత్యుత్త‌మైంది ప‌ర‌మ్‌వీర్ చ‌క్ర‌. ఆ త‌ర్వాత మహావీర్ చ‌క్ర‌, వీర చ‌క్ర అవార్డుల‌ను కూడా ఇస్తారు. ఇక పీస్‌టైం గ్యాలంట్రీ అవార్డుల్లో అశోక చ‌క్ర‌, కీర్తి చ‌క్ర‌, శౌర్య చ‌క్ర‌లు ఉన్నాయి.

గ‌త ఏడాది జూన్ 15వ తేదీన ల‌డాఖ్ స‌రిహ‌ద్దుల్లో .. భార‌త్‌, చైనా బ‌ల‌గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. గాల్వ‌న్ లోయ‌లో జ‌రిగిన ఆ ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌తీయ సైనికులు వీర మ‌ర‌ణం పొందారు.

- Advertisement -