రివ్యూ: మాస్టర్

738
vijay
- Advertisement -

తమిళ అగ్రహీరో విజయ్‌ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం మాస్టర్‌. భారీ అంచనాల మధ్య సంక్రాంతి రేసులో వచ్చిన మాస్టర్‌ని ఖైదీ దర్శకుడు లోకేష్‌ కనకరాజ్ తెరకెక్కించగా మాస్టర్‌తో విజయ్ ఏ మేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం…

కథ:

జేడీ (విజయ్) సైకాలజీ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తుంటాడు. ఆ కాలేజీ మేనేజ్మెంట్ అంతా జేడీకి వ్యతిరేకం. అయితే విద్యార్థుల్లో మాత్రం మంచి ఫాలోయింగ్ ఉంటుంది. జేడీ,విద్యార్థుల ఒత్తిడి కారణంగా కాలేజీ యాజమాన్యం స్టూడెంట్స్‌ ఎన్నికలకు ఓకే చెబుతుంది కానీ ఓ షరతు పెడుతుంది. ఎన్నికలు గొడవలు లేకుండా జరగాలంటే కాలేజీ వదిలిపెట్టి వెళ్లాలని తెలపగా జేడీ కాలేజీని విడిచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో అతను జువైనల్ అబ్జర్వేషన్ హోంలో టీచర్‌గా చేరుతాడు. అక్కడ జేడీకి ఎలాంటి అనుభవం ఎదురవుతుంది….భవాని( విజయ్ సేతుపతి)తో ఎలాంటి గొడవ జరుగుతుంది…భవానిపై జేడీ ఎలా విజయం సాధిస్తాడు అన్నది సినిమా కథ.

ప్లస్ పాయింట్స్‌ష్ట్ర

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ విజయ్‌. జేడీగా అద్భుతంగా నటించాడు విజయ్‌. తన పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. కథానాయిక మాళవిక మోహన్ చాలా అందంగా కనిపించింది. విజయ్ సేతుపతి విలన్‌గా ఇరగదీశాడు. మిగతా నటీనటులు తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ తెలుగు నేటివిటి మిస్‌ అవడం,సెకండాఫ్. డైలాగ్స్ తమిళం నుంచి మక్కీకి మక్కీ దించేసినట్లు అనిపిస్తాయి తప్ప ప్రత్యేకత ఏమీ లేదు. డబ్బింగ్ విషయంలో.. వాయిస్ ల ఎంపికలో ఇంకొంచెం జాగ్రత్త వహించి ఉండాల్సిందనిపిస్తుంది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. అనిరుధ్ అందించిన సంగీతం బాగుంది. సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం బాగుంది. సినిమా అంతటా విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు.

తీర్పు:
ఖైదీ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ సినిమాపై మరింద దృష్టిసారిస్తే బాగుండేది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కథ,స్క్రీన్‌ ప్లే తేలిపోయాయి. ఓవరాల్‌గా పర్వాలేదనిపించే మూవీ మాస్టర్‌.

విడుదల తేదీ: 13/12/2021
రేటింగ్:2.25/5
నటీనటులు:విజయ్,విజయ్ సేతుపతి,మాళవికా మోహన్‌
సంగీతం: అనిరుధ్
దర్శకుడు:లోకేష్‌ కనకరాజ్

- Advertisement -