వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నాగర్ కర్నూల్ కలెక్టర్ శర్మన్ అన్నారు.నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో మార్నింగ్ వాక్ లో భాగంగా బస్టాండ్ తో పాటు పలు కాలనీలను కలెక్టర్ శర్మన్ ఆకస్మికంగా పరిశీలించారు మార్నింగ్ వాక్ చేస్తున్న సందర్భంలో అచ్చంపేట బస్టాండ్ లో ఉన్న ఇద్దరు మతిస్థిమితం లేని యాచకులను గుర్తించి వారితో మాట్లాడారు అపరిశుభ్రంగా ఉండడం గ్రహించిన కలెక్టర్ వెంటనే వారికి కటింగ్ చేయించి నూతన వస్త్రాలు అందజేయాలని మున్సిపల్ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ ఆదేశించిన ప్రకారం మతిస్థిమితం లేని యాచకులకు మున్సిపల్ అధికారులు కటింగ్ చేయించారు వారికి పెన్షన్ వస్తుందా అని ఆరా తీసి పేర్లు నమోదు చేయించారు అనంతరం పలు కాలనీల్లో పారిశుద్ధ్య. పనులను పరిశీలించి ఉదయం ఆరు గంటల లోపే వీధులన్నీ శుభ్రపరచాలి అని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ఆ తర్వాత. చిరు వ్యాపారులతో మాట్లాడి పదివేల రుణ సదుపాయం. ఉందని జనాభాలో ఐదు శాతం ఉన్న చిరువ్యాపారులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అనంతరం బల్మూర్ లింగాల మండలాల్లోని పలు గ్రామాల్లో. పల్లె ప్రగతి పనులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తులసీరామ్ తోపాటు. మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.