తగ్గిన వర్షాలు..పెరుగుతున్న చలి!

6
- Advertisement -

దేశవ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో రాత్రి వేళల్లో చలి పెరుగుతుందని IMD హెచ్చరికలు జారీ చేసింది. వాయవ్య, సెంట్రల్ ఇండియాలో వచ్చే వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-5°C తక్కువగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని IMD సూచనలు చేసింది.

ఉత్తర భారతదేశంలో చలి ప్రభావం పెరుగుతోంది. కొండ ప్రాంతాల్లో మంచు పడటం వలన మైదాన ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. ఉదయం, సాయంత్రం చలి ఎక్కువగా ఉంటుంది, మధ్యాహ్నం మాత్రం ఎండ కొంత ఉపశమనం ఇస్తోంది. ఒకవైపు ఉత్తర భారతదేశంలో చలి పెరుగుతుండగా, మరోవైపు దక్షిణ భారతదేశంలో కొనసాగుతున్న వర్షాలు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి.

బీహార్‌లో ఎన్నికలతో పొలిటికల్ హీట్ పెరుగుతుండగా వాతావరణం మాత్రం చల్లబడుతోంది. నవంబర్ 10 వరకు బీహార్‌లో చలి మరియు పొగమంచు ప్రభావం కనిపించవచ్చు. కొన్ని చోట్ల మేఘావృతంగా ఉండే అవకాశం ఉంది. జమ్మూ-కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో మంచు పాతం ప్రారంభమైంది. కొండలు తెల్లని మంచుతో కప్పుకుపోయాయి. అక్కడి మంచు కారణంగా మైదాన ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది.

Also Read:SSMB29:రాజమౌళి మూవీ..బిగ్ అప్‌డేట్

- Advertisement -