కడసారి చూపుకోసం…

1253
santhosh babu
- Advertisement -

భారత్ – చైనా సరిహద్దులో చైనా దురగాతానికి బలైన కల్నల్ సంతోష్ బాబు పార్దివదేహాన్ని కడసారి చూసేందుకు భారీగా ప్రజల తరలివచ్చారు. వేకువజాము నుంచే పెద్ద ఎత్తున తరలివస్తున్న స్ధానిక ప్రజలు సంతోష్ బాబు పార్దివదేహానికి నివాళులు అర్పించారు.

ఎవరికి వారు స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ కరోనా వైరస్ సంక్రమణ చెందకుండా భౌతిక దూరం పాటిస్తూ పార్థివదేహాన్ని సదర్శిస్తున్నారు.ఉదయం 10 గంటల వరకు ప్రజల సందర్శనార్థం పార్థివదేహాన్ని సూర్యాపేట లో ఉంచనున్నారు.

తర్వాత కేసారం గ్రామంలో అంత్యక్రియలు జరపడానికి పార్థివదేహాన్ని తరలించనున్నారు. ఇందుకోసం ఆర్మీ ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేశారు. ఆర్మీ జనరల్ మేజర్ లతో పాటు ఆర్మీ ఉన్నతాధికారులు,కుటుంబసభ్యులు మాత్రమే అంత్యక్రియలకు హాజరుకానున్నారు.

అధికార లాంఛనాలతో సంతోష్ బాబు అంత్యక్రియలు నిర్వహించనుండగా మువ్వన్నెల జెండాను సంతోష్ బాబు పార్థివదేహాంపై ఉంచి నివాళులు అర్పించారు ఆర్మీ అధికారులు. సంతోష్ మృతికి సంతాప సూచకంగా ఇవ్వాళ కూడా సూర్యాపేట పట్టణంలో వ్యాపార వాణిజ్య వర్తక సంఘాలు బంద్ పాటిస్తున్నాయి.

- Advertisement -