టీ ఎక్కువ తాగుతున్నారా?

128
- Advertisement -

ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలా మందికి టీ లేదా కాఫీ తాగే అలవాటు అధికంగా ఉంటుంది. ఉదయం నిద్ర లేచినది మొదలుకొని రాత్రి పడుకునే వరకు మనం తీసుకునే ఫుడ్ తరువాత టీ లేదా కాఫీ తాగడానికే అధిక ప్రదాన్యత ఇస్తూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలో నీళ్ళ తరువాత అత్యాదిక మంది తాగే పానీయం టీ లేదా కాఫీ. ఇక వీటిలో చాలా రకాలే ఉన్నాయి. అల్లం టీ, లెమెన్ టీ, మసాలా టీ, తులసి టీ, కర్దోమోన్ టీ, గ్రీన్ టీ, ఇరానీ టీ, వంటి రకరకాల పేర్లతో అందుబాటులో ఉంది. అయితే ఈ కాఫీ లేదా టీ తాగడం వల్ల ఉపయోగాలు ఏ స్థాయిలో ఉన్నాయో నష్టాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. టీ లేదా కాఫీ ని తాగితే పెద్దగా ప్రమాదం లేదు గాని.. అమితంగా తాగితే పలు ఆరోగ్య సమస్యలు వెంటాడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

కాఫీ లేదా టీ లో ముఖ్యంగా కెఫీన్ అనే పదార్థం ఉంటుంది. ఒక్కసారి దీనికి అలవాటు పడితే మానడం చాలా కష్టం. కాఫీ లేదా టీ లో ఉంటే ఈ కెఫీన్ నిద్రలేమి సమస్య కు కారణం అవుతుంది. ఎందుకంటే మనకు నిద్రను కలిగించే హార్మోన్ మెలటోనిన్. దీన్ని కెఫీన్ నిరోదిస్తుంది. అందుకే టీ లేదా కాఫీ తగినప్పుడు మన నుంచి నిద్ర దూరం అవుతుంది. ఇక టీ లేదా కాఫీ ని రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తాగడం మంచిదే కానీ రోజుకు 5-10 సార్లు తాగుతుంటారు చాలమంది. ఇలా తాగడం వల్ల ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు ఏర్పడతాయి. అంతే కాకుండా టీ లో ఉండే థియోఫిలిన్ అనే పదార్థం మలబద్దకనికి కూడా కారణం అవుతుంది.

అంతే కాకుండా టీ లేదా కాఫీ అధికంగా తాగే వారిలో ఊబకాయం, డయాబెటిస్ వంటి సమస్యలు కూడా వేదిస్తున్నట్లు పలు అధ్యయనల్లో తేలింది. అయితే టీ లేదా కాఫీ ని మితంగా తాగితే కొన్ని ఆరోగ్య ప్రయోజనలు ఉన్నాయి. కాఫీలో కెఫీన్ అనే పదార్థంలో పాటు మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి కాలేయన్ని పరిరక్షించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఆడవారిలో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ ను తగ్గించే గుణం టీ లేదా కాఫీలో ఉంటుంది. ఇక కాఫీలో మైగ్రేన్ ను తగ్గించే గుణం ఉంటుంది. చాలమందికి తలనొప్పి రావడానికి ఈ మైగ్రేన్ ప్రధాన కారణం. టీ లేదా కాఫీ తగినప్పడు ఇందులో ఉండే కెఫీన్ యాంటీ మైగ్రేన్ గా పని చేసి తలనొప్పిని దూరం చేస్తుంది. అందువల్ల కాఫీ లేదా టీ మితంగా తాగితే పెద్దగా కొన్ని ఆరోగ్య ప్రయోజనలు ఉన్నప్పటికి.. అమితంగా తాగితే నష్టాలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -