ముంబై మహానగరం..నిత్యం రద్దీ ఏరియా.. .. ఎప్పుడూ హడావిడిగానే ఉంటుంది.. పెద్ద పెద్ద వాళ్లు సైతం ఆ రోడ్డులో తిరిగేవాళ్లే. అలాంటి రోడ్డులో ఓ చెట్టు కూలింది. చెట్టు పడిపోవటం కామన్ అయినా.. దాని కింద పడి ఓ మహిళ యాంకర్ చనిపోవడం విషాదాన్ని మిగిల్చింది.
ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో నివసించే దూరదర్శన్ మాజీ యాంకర్ 58 ఏళ్ల కంచన్ నాథ్ ఎప్పటిలాగే మార్నింగ్ కు వాక్ వెళ్లారు. ఇంటి సమీపంలో నడుస్తుండగా కొబ్బరిచెట్టు అకస్మాత్తుగా ఆమె మీద విరుచుకు పడడంతో కుప్పకూలారు. అపస్మారక స్థితిలో చేరుకున్న ఆమెను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ కంచన్ కన్ను మూసింది.
ఈ దృశ్యాలన్ని అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయింది. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ చెట్టును కొట్టివేయడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో బీఎంసీ అనుమతి నిరాకరించిందని వారు ఆరోపించారు. బీఎంసీ నిర్లక్ష్యం కారణంగానే ఈ రోజు కంచన్ ప్రాణాలు కోల్పోయిందని వాపోయారు. కుటుంబసభ్యులతో పాటు స్ధానికులు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కంచన్ మృతి చెందిందని మండిపడుతున్నారు.