అక్షయ్‌కి రెండోసారి కరోనా..

13
akshay

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రెండోసారి కరోనా బారిన పడ్డారు. మరికొద్దిరోజుల్లో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ అయిన Cannes Film Festival 2022లో పాల్గొనాల్సి ఉండగా అక్షయ్‌కి కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. దీంతో ప్రముఖ ఫిల్మ్ ఫెస్టివల్‌‌కి హాజరయ్యే ఛాన్స్ మిస్సవుతానంటూ ట్వీట్ చేశాడు.

Cannes 2022లో భారతీయ సినిమాకి ప్రాతినిథ్యం వహించడానికి ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. కానీ.. అనుకోకుండా కోవిడ్‌ పాజిటివ్ వచ్చింది. దాంతో విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి. అనురాగ్ ఠాకూర్‌కి, ఆయన బృందానికి శుభాకాంక్షలు. ఇలాంటి మంచి ఛాన్స్‌ని మిస్సవుతున్నందుకు బాధగా ఉంది అంటూ రాసుకొచ్చాడు.