మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు..

86
- Advertisement -

గ్యాస్‌ ధరల పెంపు ఆగడం లేదు. రెండు రోజుల క్రితం గృహావసరాలకు వినియోగించే, కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్‌ ధరలు పెరుగగా తాజాగా సీఎన్జీ ధరలు పెరిగాయి. గత వారం రూ.2 వడ్డించగా, మళ్లీ మరో రూ.2 భారంమోపారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ.75.61కి చేరింది.

కర్నాల్‌, కైతాల్‌ రూ.84.27, కాన్పూర్‌, హమిర్‌పూర్‌, ఫతేహ్‌పూర్‌ రూ.87.40, అజ్మీర్‌, పాలి, రాజ్‌సమండ్‌ రూ.85.88కు చేరగా నోయిడా, గ్రేటర్‌ నోయిడా, ఘజియాబాద్‌లో రూ.78.17, ముజఫర్‌నగర్‌, మీరట్‌, షామ్లీ రూ.82.84, గురుగ్రామ్‌ రూ.83.94, రెవారి రూ.86.07కి చేరింది.

- Advertisement -