CMKCR:హరితహాసం కార్టూన్ల బుక్‌ ఆవిష్కరణ

57
- Advertisement -

ప్రకృతి పర్యావరణంపై స్పృహను కలిగించే హరితహాసం కార్టూన్‌ సంకలనాన్ని విడుదల చేసిన సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్పూర్తిగా తీసుకొని ప్రత్యేకంగా హరితహాసం అనే పేరుతో ట్రీ టూన్స్‌ కార్టూన్లు ప్రముఖ కార్టూనిస్టు మృత్యుంజయ గీశారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ప్రతినిధులు రాఘవ, కరుణాకర్‌, సీఎం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్‌, తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సమయోచితంగా, ప్రతి ఒక్కరికి చెట్ల పెంపకంపై అవగాహన కలిగేలా హరితహాసం-ట్రీ టూన్స్‌లో కార్టూన్లు ఉన్నాయని సీఎం అన్నారు. ఒకసామాజిక అంశంపై మూడు వందల కార్టూన్లతో సంకలనం చేయటం అభినందించదగిన విషయమని కొనియాడారు. కార్టూనిస్టు మృత్యుంజయను ప్రశంసించారు. హరిత తెలంగాణను ప్రతిబింబించేలా ఉనన కార్టూన్‌ పెయింట్ ను సీఎంకు బహూకరించారు.

రాజకీయ విషయాలపైనే కాకుండా, సామాజిక అంశాలపై ప్రజలను ఆలోచించేలా కార్టూనిస్టులు గీసే చిత్రాలు మరింత మందిని ప్రకృతికి దగ్గర చేస్తాయని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Also Read: MP Santhosh:ఉప్పల్‌ భగాయత్‌లో గ్రీన్ ఛాలెంజ్..

ఒక మొక్కతో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నేడు దేశవ్యాప్తంగా లక్షల మందికి చేరవైందని అన్నారు. కోట్ల మొక్కలు నాటేలా ప్రోత్సహించిందని మృత్యుంజయ లాంటి కార్టూనిస్టులను కూడా స్పందించే విధంగా అలాగే కార్టూన్లు గీసేలా ప్రేరణ చేయటం తమకు సంతృప్తిని ఇస్తోందని ఎంపీ సంతోష్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచే సోషల్ యాక్టివిస్ట్‌గా ఉన్న మృత్యుంజయ ఇప్పుడు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను మరింత ప్రాచుర్యంలోకి తీసుకువెళ్తున్నారని ఎంపీ ప్రశంసించారు.

Also Read: CM KCR:తెలంగాణ అంటేనే హరిత రాష్ట్రం

- Advertisement -