రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ట్రాన్స్ కో ,జెన్కో సిఎండి ప్రభకార్ రావు విద్యుత్ అధికారులు, ఇంజనీర్స్ ను అప్రమత్తం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎస్పీడిసిఎల్, ఎన్పిడిసిఏల్ సిఎండిలతో చర్చిస్తున్నారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు విద్యుత్ డిమాండ్ భారీగా పడిపోయిందన్నారు. విద్యుత్ డిమాండ్ 12 వేల మెగా వాట్స్ నుండి 4300 మెగావాట్స్ పడిపోయింది. దీనితో పెరిగిన వోల్టేజ్‌పై విద్యుత్ అధికారులు అప్రమత్తమైయ్యారు. ఈ నేపథ్యంలో రాత్రికి విద్యుత్ డిమాండ్ మరింత పడిపోనుండడంతో అధికారులను అప్రమత్తంగా ఉండాలని ట్రాన్స్ కో జెన్కో సిఎండి ప్రభాకర్ రావు అదేశించారు.
విద్యుత్ డిమాండ్‌లో హెచ్చుతగ్గుల నేపథ్యంలో నిన్న రాత్రి నుండి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తు లోడ్ డిస్స్పాచ్ చేయిస్తున్నారు సిఎండి ప్రభకార్ రావు. విద్యుత్ డిమాండ్ తగ్గడం థర్మల్ యూనిట్స్ అన్ని బ్యాక్ డౌన్ చేశామని ఆయన తెలిపారు. వర్షం నీరు నిల్వ వున్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే సంస్థకు తెలియజేయలని సీఎండీ ప్రభకార్ రావు తెలిపారు.
అలాగే ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడిన,సెల్లార్ లకు నీళ్లు వచ్చిన దయచేసి ప్రజలు 1912 / 100 స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేసి తెలుపాలని ప్రభాకర్ రావు వెల్లడించారు. ఎక్కడైనా వర్షం నీరు సెల్లార్ లోకి వస్తే పవర్ సప్లై ఆఫ్ చేసుకోండి ఎందుకంటే షాట్ సర్క్యూట్ కాకుండా ఉంటుందని సూచించారు.