కరోనా తీవ్రత తగ్గింది..భయపడకండి: మంత్రి ఎర్రబెల్లి

89
Minister Errabelli

పాలకుర్తి నియోజకవర్గంలోని కరోనా బాధితులతో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. కరోనా మహమ్మారి రోజు రోజుకు తీవ్రత తగ్గుతుంది..భయపడకండి.. హోమ్ ఐసోలేషన్‌లో ఉండి ప్రభుత్వ దవాఖానలో డాక్టర్లు ఇచ్చిన మందులు సరిగ్గా వేసుకుందాం… కరోనా మహమ్మారిని జయించుదాం అంటూ… తనదైన శైలిలో కరోనా బాధితులు,వారి కుటుంబసభ్యులు,ప్రజా ప్రతినిధులు,అధికారులు,వైద్యులు,పోలీసులు,తదితర అధికారులతో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కరోనా మహమ్మారి తీవ్రత తగ్గింది… ఉదయం యోగ,రోజుకు రెండు సార్లు ఆవిరి పడితే చాలు కరోనాను జయించోచన్నారు. అలాగే నా ఆదేశాల మేరకు ప్రజా ప్రతినిధులు వారితో పాటు నేను కూడా మా వంతు సహాయం చేస్తున్నామన్నారు. అట్లాగే కరోనా బాధితులు వేడి వేడి ఆహారం తీసుకోవాలన్నారు. వర్షాలు భారీగా పడుతున్నాయి పాత ఇళ్లలో ఉన్న కరోనా బాధితులను వేరే ఇళ్లకు మార్చడానికి మండల ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులు,వారి కుటుంబ సభ్యులు ప్రజాప్రతినిధులు,అధికారులు,పోలీసులు,వైద్యులు తదితరులు పాల్గొన్నారు.