శ్రీశైలంలో త్వరలో విద్యుత్ ఉత్పత్తి: సీఎండీ ప్రబాకర్ రావు

167
cmd prabhakar rao

శ్రీశైలంలో త్వరలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు సీఎండీ ప్రభాకర్ రావు. శ్రీశైలం పవర్ హౌస్ ప్రమాద స్ధలాన్ని పరిశీలించారు. అనంతరం విద్యుత్ అధికారులతో ఈగలపెంట కృష్ణవేణి గెస్ట్ హౌజ్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దురదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరిగిందన్నారు. 1, 2 యూనిట్స్ బాగానే ఉన్నాయని.. 5వ యూనిట్‌ కూడా బాగానే ఉందని.. 6వ యూనిట్‌లో ప్యానెల్ దెబ్బతిందని యూనిట్ 4లో ఎక్కువగా నష్టం జరిగిందని తెలిపారు. అంతా అనుకున్నట్లు వేల కోట్ల నష్టం జరగలేదని కానీ ప్రాణ నష్టం జరగడం చాలా బాధకరం అన్నారు.

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.