సీఎం స్టాలిన్‌…ఫిట్ నెస్ ఛాలెంజ్

171
dmk
- Advertisement -

అధికారంలోకి వచ్చిన తర్వాత తనదైన శైలీలో పనితీరుతో ప్రజల మన్ననలు పొందుతున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. అయితే ఓ వైపు పాలనలో బిజీగా ఉన్న తన ఫిట్‌ నెస్‌పై మాత్రం దృష్టి సారిస్తూనే ఉన్నారు స్టాలిన్.

గ‌తంలో స్టాలిన్ చెన్నై మేయ‌ర్‌గా ,తర్వాత ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో కూడా త‌న దిన‌చ‌ర్య‌లో ఎలాంటి మార్పులు చేయ‌లేదు స్టాలిన్. నిత్యం యోగా, సైక్లింగ్‌, జిమ్ చేయ‌డం త‌ప్ప‌నిస‌రి. తాజాగా 68 ఏళ్ల వ‌య‌సులో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన స్టాలిన్‌ తన ఫిట్‌నెస్‌పై దృష్టిసారిస్తూనే ఉన్నారు.

తాజాగా జిమ్‌లో ఎక్స‌ర్‌సైజ్ చేస్తున్న ఫొటోల‌ను డిఎంకే నేత‌లు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారాయి. ఇక స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా స్టాలిన్ ఎంజీఎం డిజ్జీ వ‌రల్డ్ నుంచి మమ‌ళ్ల‌పురం వ‌ర‌కు 24 కిలోమీట‌ర్ల‌మేర సైక్లింగ్ కూడా చేస్తుంటారు. మొత్తం ఆరు పదుల వయస్సులోనూ ఫిట్ నెస్‌గా ఉండటం కోసం స్టాలిన్ చేస్తున్న పని ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది.

- Advertisement -