పవన్‌ తండ్రిలాంటి వ్యక్తి: రామ్ చరణ్

87
ntr

పవన్ తనకు తండ్రి లాంటి వ్యక్తి అని తెలిపారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరులు షో తొలి ఎపిసోడ్ గెస్ట్‌గా వచ్చారు రామ్ చరణ్‌. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

చిన్నప్పటి నుంచి పవన్ తనని జాగ్రత్తగా చూసుకున్నారని… అతను తనకు తండ్రి లాంటి వ్యక్తి అన్నారు. అయితే ఆయనను బాబాయ్ అని పిలవాలా ? అన్నా అని పిలవాలా ? అనేది అర్థం కాదు. ఆయన నాకు సోదరుడి లాంటి వ్యక్తి. మా సంబంధాన్ని మాటల్లో చెప్పలేము. ఒకవేళ మా మధ్య రిలేషన్ గురించి బయటకు చెప్తే దిష్టి తగులుతుందేమో ! అని వెల్లడించారు.

ఇక ఈ షో ప్రారంభం సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఆకర్షణీయమైన దుస్తుల్లో స్టైలిష్‌గా, స్మాషింగ్‌గా కనిపించాడు. మధ్యలో రానాతో మాట్లాడటం ప్రేక్షకులను ఆకట్టుకుంది.