శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక లోకానికి విషెస్ తెలిపారు రేవంత్. ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందని అన్నారు.
కార్మికులందరికీ సముచిత గౌరవం లభిస్తుందని…తెలంగాణ ఉద్యమం నాటి నుంచి తెలంగాణ పునర్నిర్మాణానికి అలుపెరగకుండా శ్రమిస్తున్న కార్మికులందరికీ ముఖ్యమంత్రి అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి తప్పకుండా దోహదపడుతుందని అన్నారు.
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. మే’ డే సందర్భంగా ముఖ్యమంత్రి @revanth_anumula కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని అన్నారు.
శ్రామికులే అభివృద్ధిలో అసలైన…
— Telangana CMO (@TelanganaCMO) May 1, 2024