‘జిల్లాల పునర్విభజన’.. రేవంత్ ఫోకస్?

43
- Advertisement -

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం సి‌ఎం రేవంత్ రెడ్డి జిల్లాల విభజనపై పునః పరిశీలిస్తున్నాట్లు తెలుస్తోంది. 2014 రాష్ట్రం ఏర్పడిన తరువాత కేవలం పది జిల్లాలు మాత్రమే ఉండేవి. కానీ పాలన సౌలభ్యం కోసం అప్పటి ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ జిల్లాల సంఖ్యను 33కు చేశారు. రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలను ఏర్పాటు చేసి ప్రజలకు పాలన మరింత దగ్గర చేశారు. అయితే తాజాగా సి‌ఎం రేవంత్ రెడ్డి జిల్లాల కుదింపు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

మూడు చిన్న జిల్లాలు ఉన్న చోట రెండిటిగాను, రెండు చిన్న జిల్లాలు ఉన్న చోట ఒకటిగాను మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా జిల్లాల పునర్విభజన పై సి‌ఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జిల్లాల పునర్విభజనపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఓ కమిషన్ ఏర్పాటు చేస్తామని, అసెంబ్లీలో కూడా దీనిపై చర్చిస్తామని చెప్పుకొచ్చారు. అయితే జిల్లాల పునర్విభజనపై రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాల కారణంగా ఇబ్బందులు తప్పవనే వాదన వినిపిస్తోంది. ఆల్రెడీ 33 గా ఉన్న జిల్లాలను మళ్ళీ కుదించడం అంత తేలికైన విషయం కాదు. ప్రజల్లో కూడా దీనిపై వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందనేది కొందరు విశ్లేషకులు చెబుతున్న మాట. మరి రేవంత్ రెడ్డి సర్కార్ జిల్లాల పునర్విభజనపై ఎలా అడుగులు వేస్తారో చూడాలి.

Also Read:పవన్ ఫిక్స్.. పోటీ అక్కడి నుంచే?

- Advertisement -