కాంగ్రెస్‌ను అధికారంలోకి తెద్దాం..దేశాన్ని కాపాడుదాం

34
- Advertisement -

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర స్పూర్తితోనే కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాగపూర్ సభలో మాట్లాడిన సీఎం రేవంత్..కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారన్నారు. 150రోజులు 4వేలకు పైగా కిలోమీటర్లు రాహుల్ భారత్ జోడో యాత్ర చేశారని..భారత్ జోడో యాత్ర స్పూర్తితో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.

కర్ణాటక తరువాత జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించింది…. తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. తెలంగాణ తరువాత జోడో యాత్ర మహారాష్ట్రలో ప్రవేశించిందని…ఈ సారి మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఇప్పుడు రాహుల్ భారత్ న్యాయ యాత్ర మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు చేపట్టనున్నారన్నారు. ఈసారి దేశంలో ఎర్రకోటపై కాంగ్రెస్ మూడు రంగుల జెండా ఎగరడం ఖాయం.. దీన్ని మోదీ కూడా ఆపలేరన్నారు.

ప్రతీ మెడిసిన్ కు ఒక expiry తేదీ ఉంటుందని..నరేంద్రమోదీ అనే మెడిసిన్ కు కూడా expiry తేదీ అయిపోయిందన్నారు.రాబోయే రోజుల్లో మోదీ అనే మెడిసిన్ దేశంలో పనిచేయదని…డబుల్ ఇంజన్ సర్కార్ అని బీజేపీ పదే పదే చెబుతుందన్నారు.డబుల్ ఇంజన్ అంటే ఆదానీ.. ప్రధాని..లోక్ సభలో రాహుల్ గొంతు విప్పడంతో ఆదానీ ఇంజన్ ఆగిపోయింది.. షెడ్ కు పోయిందన్నారు. ఇప్పుడు భారత్ న్యాయ యాత్ర తో ప్రధాని ఇంజన్ ఆగిపోవడం ఖాయం…. షెడ్డుకు పంపడం ఖాయం అన్నారు. కాంగ్రెస్ శ్రేణులారా వందరోజులు దేశం కోసం పనిచేయాలని..కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయండన్నారు.దేశంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చి… దేశాన్ని కాపాడుకుందాం అన్నారు.

Also Read:ముందు ఎన్టీఆర్ తోనా ?..చరణ్ తోనా ?

- Advertisement -