Revanth:రేవంత్ ‘రౌడీ రాజకీయం’?

24
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ రౌడీ రాజకీయం చేస్తోందా ? ప్రశ్నిస్తే బెదిరించేందుకు పూనుకుంటుందా ? అంటే అవునని చెప్పక తప్పదు. ఇటీవల సి‌ఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. గత ప్రభుత్వ హయంలో ఎలాంటి నీటి కష్టాలు చూడని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. మరోవైపు కరెంటు కోతలు కూడా అంతే దారుణంగా ఉన్నాయి. ఇక నేతన్నలకు ఎదురవుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.. ఇన్ని సమస్యలు రాష్ట్రంలో ప్రజలను ఇబ్బంది పెడుతుంటే.. కాంగ్రెస్ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.

ఇదేంటి అని ప్రశ్నిస్తే.. ” పడంబెట్టి తొక్కుతా, పేగులు మెడలో వెసుకుంటా ” అని సి‌ఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.. దీంతో ఇదేం పాలన అంటూ ప్రజలు నోరెళ్ళబెడుతున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి వైఖరిపై తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు తనదైన రీతిలో మండిపడ్డారు. కాంగ్రెస్ గ్యారెంటీల పేరుతో గారడీ చేస్తోందని, దొంగ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలని ప్రశ్నించిన కే‌సి‌ఆర్ పై డ్రాయర్ ఉడగొడతానని రేవంత్ రెడ్డి అంటున్నారని పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిపై మాట్లాడే భాష ఇదేనా ? రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రివా ? చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా ? అంటూ హరీష్ రావు మండిపడ్డారు.

ఇచ్చిన హామీలన్ని నెరవేర్చెంత వరకు కాంగ్రెస్ ను వదిలిపెట్టె ప్రసక్తే లేదని హరీష్ రావు తేల్చి చెప్పారు. ఇక వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. మహిళలకు ప్రతి నెల రూ.2500, రైతు భరోసా, రైతు రుణమాఫీ,.. ఇలా ఇంకా చాలా హామీలనే పెండింగ్ లో ఉంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి వీటివిషయంలో ప్రశ్నించిన వారిపై సి‌ఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు నిజంగా సిగ్గుచేటు అనేది కొందరి అభిప్రాయం.

Also Read:Revanth:రేవంత్ కు ‘భయం’ పట్టుకుందా?

- Advertisement -