మేడారం అభివృద్ధి పనుల డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వెయ్యేళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా రాతి కట్టడాలతో మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణ చేపట్టనున్నారు. ఈ గొప్ప కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు రేవంత్. 100 రోజుల్లో ప్రణాళికలకు తగ్గట్లుగా పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు సీఎం రేవంత్.
ప్రతీ వారం ఇన్చార్జీ మంత్రి పొంగులేటి పనులను పర్యవేక్షిస్తారని సీఎం రేవంత్ తెలిపారు. సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణ ఈ జన్మలో మాకు దక్కిన అదృష్టం అన్నారు. గతంలో నిధుల కోసం ప్రభుత్వాలను అడ్డుకునే పరిస్థితి ఉండేది…. సీతక్క సంతకం పెట్టి నిధులు తెచ్చే పరిస్థితి వస్తుందని ఆనాడు చెప్పాను అన్నారు.
ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది… నిధులు లేకున్నా మేడారం తల్లుల కోసం ఎన్ని కోట్లు అయినా వెనుకాడం అన్నారు. సంప్రదాయాలను పరిరక్షించడంలో ఆదివాసీలను భాగస్వాములను చేస్తున్నాం..గిరిజన వారసులను కలుపుకొని ముందుకు వెళ్తాం అన్నారు.
అంతకముందు మేడారం చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సమ్మక్క- సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్న సీఎం.. సమ్మక్కకు నిలువెత్తు బంగారం సమర్పించారు.
Also Read:బ్రహ్మోత్సవాలు..ప్రివిలేజ్ దర్శనాలు రద్దు

