దసరా ‘డ్రై’ డేనే..సుక్క-ముక్క బంద్‌!

8
- Advertisement -

తెలంగాణ అంటేనే దసరా. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా దసరా సంబరాలు మొదలయ్యాయి. ప్రతీ పల్లెలో బతుకమ్మ సంబరాలతో హోరెత్తుతున్నాయి. ఇక దసరా అంటే సుక్క-ముక్క ఉండాల్సిందే.

ఎందుకంటే సుక్క లేనిదే దసరా పండగకు కిక్కు ఉండదు. అయితే ఈ సారి దసరా డ్రై డేనే కానుంది. అంటే సుక్క, ముక్క రెండు బంద్ . ఎందుకంటే అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి. ఇదే రోజు దసరా వస్తుండటంతో లిక్కర్ షాపులే కాదు మాంసం షాప్‌లు కూడా బంద్.

ఇప్పటికే ఎక్సైజ్ శాఖ దసరా రోజు లిక్కర్ షాపులు బంద్ ఉంటాయని తెలపడంతో మందు బాబుల్లో అలజడి మొదలైంది. వాస్తవానికి గతేడాది దసరా రోజు 3 లక్షల కేసులకు పైగా బీర్లు సేల్ అయ్యాయంటే దసరా రోజు ఉండే డిమాండ్ ఎంతో అర్ధం చేసుకో వచ్చు. ఇక గతేడాది దసరా-బతుకమ్మ జరిగిన 10 రోజుల్లో రూ.1285 కోట్ల ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా వచ్చింది.

అయితే ఈ ఏడాది గాంధీ జయంతి రావడంతో మద్యం దుకాణాల మూసివేత తప్పదని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలపడంతో రాష్ట్ర ఖజానాకు భారీగా గండిపడే అవకాశం ఉంది. అలాగే ప్రతీ ఇంట్లో మందుతో పాటు మాంసం ఉండాల్సిందే. గొర్రెలు, మేకపోతులు, పొట్టేళ్లను కోసి వాటాలు వేయాల్సిందే. పెద్దపెద్ద వాహనాల యజమానులు వారి దుకాణాలు, పరిశ్రమల ముందు మేకపోతులు, గొర్రెపోతులను బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి గాంధీ జయంతి కావడంతో వారి ఆశలకు గండిపడినట్లే. మాంసం దుకాణాలను మూసివేస్తే తీవ్ర ప్రభావం ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు సైతం ఇదే గందరగోళంలో ఉన్నారు. ఎందుకంటే ఓ వైపు ప్రజల సెంటిమెంట్ మరోవైపు గాంధీ జయంతి నిబంధనలు…ఈ గందరగోళంలో ఏం చేయాలో తెలియ అధికారులు సైతం అయోమయంలో ఉన్నారు. అయితే అధికారులు ఎంత కట్టడి చేసినా కొన్ని చోట్ల రహస్యంగా విక్రయాలు జరిగే అవకాశం ఉండగా అధికారులు చూసిచూడనట్లు వదిలేస్తారా? లేక చర్యలు తీసుకుంటారా వేచిచూడాల్సిందే. ఏదిఏమైనా ఈ సారి దసరా డ్రై డేనే అని మరికొంతమంది చెబుతున్నారు.

Also Red:బ్రహ్మోత్సవాలు..ప్రివిలేజ్ దర్శనాలు రద్దు

- Advertisement -