- Advertisement -
సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ రాత్రి రాష్ట్ర అధికారుల బృందంతో కలిసి జపాన్‌కు వెళ్లనున్నారు సీఎం రేవంత్. ఏప్రిల్ 16 నుండి 22 వరకు తెలంగాణ ప్రతినిధి బృందం జపాన్ పర్యటన కొనసాగుతుంది.
టోక్యో, మౌంట్ ఫుజి, ఓసాకా, హీరోషిమా లో ముఖ్యమంత్రి బృందం పర్యటిస్తుంది. ఓసాకా వరల్డ్ ఎక్స్పో 2025లో తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభిస్తుంది.
ఆ దేశానికి చెందిన ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక వేత్తలు, పలువురు ప్రతినిధుల తో ముఖ్యమంత్రి బృందం సమావేశమవుతుంది. రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక సాంకేతిక సహకారంపై ప్రధానంగా చర్చలు జరుపుతుంది.
- Advertisement -