వరంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి

9
- Advertisement -

తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ఆరా తీశారు రేవంత్. ఈ నేపథ్యంలో వరంగల్‌కు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హన్మకొండలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు సీఎం.

మరోవైపు గొప్ప పనికి పిలుపునిచ్చారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. వరంగల్ ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తడంతో చాలా మంది ప్రజలకు తినడానికి ఆహారం లేదు …ఇవాళ నగరంలో చాలా పెళ్లిళ్లు జరుగుతున్నాయి, దయచేసి అక్కడ భోజనం వేస్ట్ చేయకండి అన్నారు.

ఫుడ్ ఫుడ్ మిగిలితే మాకు సమాచారం ఇవ్వండి… నిరాశ్రయులుగా ఉన్న వారికి మా టీమ్స్ నేరుగా వెళ్లి భోజనం అందజేస్తుంది… అధికారులు వాళ్ల పనులు వాళ్లు చేస్తున్నారు, ప్రజలు కూడా భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు నాయిని.

Also Read:బైక్‌ను కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన కారు

- Advertisement -