బైక్‌ను కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన కారు

11
- Advertisement -

గుజరాత్‌లో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. బైక్‌ను కిలోమీటర్ ఈడ్చుకెళ్లింది కారు. మద్యం మత్తులో కారు నడిపి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి కిలోమీటరుకు పైగా ఈడ్చుకెళ్లారు ఓ ఉపాధ్యాయుడు.

గుజరాత్‌లోని మహిసాగర్ జిల్లా మోడాసా-లూనావాడ రోడ్డుపై సోదరుడు మెహుల్ పటేల్‌తో కలిసి మద్యం తాగి కారులో ప్రయాణించారు మనీశ్ పటేల్ అనే ఉపాధ్యాయుడు. ఈ క్రమంలో దినేశ్‌భాయ్ (50), సునీల్ (21) అనే ఇద్దరు వ్యక్తులు వెళ్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టారు టీచర్.

ప్రమాదం తర్వాత కూడా కారును ఆపకుండా, దాని ముందు భాగంలో ఇరుక్కుపోయిన బైక్‌ను అలాగే కిలోమీటరుకుపైగా లాక్కెళ్లారు. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read:కేబినెట్ విస్తరణ..ఈసీకి బీజేపీ ఫిర్యాదు

- Advertisement -