- Advertisement -
మంత్రి నారా లోకేష్ ఫోటోతో రూ.54 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. లోకేష్ ఫోటోని వాట్సాప్ డీపీగా పెట్టుకుని వైద్య పరీక్షల కోసం ఆర్థిక సాయం ఇప్పిస్తామని చెప్పి బురిడీ కొట్టించారు.
వైద్య పరీక్షల కోసం ఆర్థిక సాయం అడిగిన వారికి నకిలీ బ్యాంక్ క్రెడిట్ రసీదులు పంపి సాయం చేస్తున్నట్లు నమ్మించారు సైబర్ నేరగాడు. కొన్ని రోజుల తర్వాత సాయంగా అందించిన డబ్బులు జమ కావాలంటే 4% రేమిటెన్స్ చార్జెస్ కట్టాలంటూ డబ్బులు వసూలు చేశారు.
అలా రూ.54.34 లక్షలు వసూలు చేశారు ముగ్గురు సైబర్ నేరగాళ్లు. బాధితుడి ఫిర్యాదుతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు సీఐడీ అధికారులు.
Also Read:బైక్‌ను కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన కారు
- Advertisement -

