ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి వస్తుండగా భారీ ఏర్పాట్లు చేశారు. నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంఖుస్థాపన చేయనున్నారు రేవంత్.
కొడంగల్ లో వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలల పనులకూ శ్రీకారం చుట్టనున్నారు. నియోజకవర్గంలో మొత్తం రూ.4369.143 కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేయనున్నారు. ఇవాళ సాయంత్రం హెలికాఫ్టర్ లో కోస్గి చేరుకోనున్నారు సీఎం రేవంత్. కోస్గి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మైదానంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేయనున్నారు.
అనంతరం స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించనున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖి అనంతరం వారికి బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేయనున్నారు. సాయంత్రం 5గంటలకు కోస్గిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనన్నారు.
Also Read:లవ్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా వాస్తవం