లవ్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా వాస్తవం

20
- Advertisement -

మేఘశ్యాం, రేఖ నిరోష హీరో హీరోయిన్లుగా అంజనిసూట్ ఫిలిమ్స్ సంస్థ పై ఆదిత్య ముద్గల్ నిర్మాతగా జీవన్ బండి దర్శకత్వంలో వస్తున్న సినిమా వాస్తవం. ఈ సినిమాకి పెద్దపల్లి రోహిత్ (పి. ఆర్) మ్యూజిక్ అందించారు. ఈ సినిమా నుంచి గతంలో విడుదలైన ఫస్ట్ లుక్ మరియు సాంగ్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అదేవిధంగా ఈరోజు రిలీజ్ అయిన టీజర్ కి సినిమా పైన అంచనాలు పెంచేస్తోంది.

ఈ సందర్భంగా నిర్మాత ఆదిత్య ముద్గల్ మాట్లాడుతూ : ఈ సినిమా ఇష్టంతో చాలా కష్టపడి తీసాం. డైరెక్టర్ జీవన్ చెప్పిన కథ తీసిన విధానం చాలా బాగుంది. హీరో మేఘశ్యాం హీరోయిన్ రేఖా నిరోషా చాలా బాగా నటించారు. పి. ఆర్ అందించిన మ్యూజిక్ కి చాలా మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని ప్రేక్షకులు ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.

దర్శకుడు జీవన్ బండి మాట్లాడుతూ : ఈ కథ నేను చెప్పినప్పుడు నన్ను నమ్మి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ ఆదిత్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాలో చేసిన ప్రతి చిన్న క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. నా టెక్నీషియన్స్ అందరూ ఆర్టిస్టులు నాకు చాలా సపోర్ట్. పి. ఆర్ అందించిన మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. హీరో మేఘశ్యాం హీరోయిన్ రేఖ నిరోషా చాలా బాగా నటించారు. కచ్చితంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. మీ అందరి సపోర్ట్ ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరోయిన్ రేఖ నిరోషా మాట్లాడుతూ : మా సినిమా లో చాలా మంచి కంటెంట్ ఉంది కాని సరైన సపోర్ట్ లేదు. మీడియా ప్రేక్షకులే మాకు సపోర్ట్. ఈ సినిమా చాలా కష్టపడి తీసాం. అందరికీ నచ్చే కథ అవుతుంది. అతి త్వరలో ఈ సినిమాను మీ ముందుకు తీసుకురాబోతున్నాం. మీ సపోర్ట్ ఆశీస్సులు మాపై ఉండాలని ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

Also Read:చారి 111..ఆపరేషన్ రుద్రనేత్ర

- Advertisement -