ఒకే ఏడాదిలో దెబ్బతీశారు: హరీష్‌ రావు

40
- Advertisement -

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ గడిచిన పది సంవత్సరాల్లో (కోవిడ్ మినహాయించి) వార్షిక వృద్ధిరేటు 25.62 శాతం సాధించిందని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. అయితే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక, 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖ ఆదాయంలో 1.93 శాతం తగ్గుదల నమోదవడం వారి అనాలోచిత నిర్ణయాలకు నిదర్శనం అని అన్నారు.

1.HYDRA పేరుతో పేద,మధ్య తరగతి ఇండ్లు కూల్చడం.

2.మూసీ రివర్ ఫ్రంట్ అంటూ నగర అభివృద్ధిపై బుల్డోజర్ ఎక్కించడం.

3.మెట్రో లైన్ ప్రణాళికల్లో అనవసర మార్పులు చేసి మౌలిక వసతుల ప్రగతిని అడ్డుకోవడం.

4.రాష్ట్రానికి కీలకమైన ఫార్మా సిటీని రద్దు చేయడం వల్ల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు కోల్పోవడం.

ఈ తొందరపాటు నిర్ణయాల కారణంగా ఒకప్పుడు వేగంగా ఎదిగిన తెలంగాణ ఇప్పుడు వెనుకబాటుకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన ప్రణాళికలను పక్కనబెట్టి, అరుదైన అవకాశాలను కోల్పోతున్నారు” అని హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రాభివృద్ధిని కాపాడుకోవాలంటే స్పష్టమైన దిశా నిర్దేశంతో మౌలిక వసతులను పటిష్ఠంగా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు.

Also Read:ఆకు కూరలతో ఆరోగ్య ప్రయోజనాలు?

- Advertisement -