24న కలెక్టర్ల కాన్ఫరెన్స్

57
- Advertisement -

ఈ నెల 24న కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదివారం జరిగే ఈ సమావేశంకు ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం అయ్యాక రేవంత్ కలెక్టర్లతో భేటీ కావడం ఇదే తొలిసారి.

భూ రికార్డు లతో ముడిపడిన సమస్యలతో పాటు కౌలు రైతుల గుర్తింపు వంటి అంశాల పై చర్చిచేఅవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి వంటి పథకాల అమలు కూడా చర్చించే అవకాశం ఉంది.

ఆరు గ్యారంటీల అమలుతో పాటు మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో లోపాలు, వైఫల్యాలను సైతం బయట పెడతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ధరణి వెబ్ సైట్ కు సంబంధించి లక్షకు పైగా ఫిర్యాదులు ఉన్న నేపథ్యంలో కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. అధికారులు పూర్తి నివేదిక అందిస్తే త్వరలోనే ధరణిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

Also Read:సలార్ పై లేటెస్ట్ విశేషాలు

- Advertisement -