సిగాచి కంపెనీ అగ్నిప్రమాద మృతులకు కోటి నష్టపరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. సిగాచి కంపెనీలో గతంలో ఎప్పుడైనా ప్రమాదాలు జరిగాయా అని ఆరా తీశారు. బాధితులకు ప్రభుత్వం తరుఫున అండగా ఉంటాం.. ఇలాంటి ప్రమాదం తెలంగాణలో ఇప్పటివరకు జరగలేదు అన్నారు.
సిగాచి ప్రమాదం దురదృష్టకరం, అత్యంత విషాద ఘటన.. అన్ని శాఖలు సమన్వయంతో రెస్క్యూ నిర్వహిస్తున్నాం అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం అందించాలని ఆదేశిస్తున్నాం.. గాయపడి పనిచేయని స్థితిలో ఉన్న బాధితులకు రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు.
దుర్ఘటన జరిగిన సమయంలో పరిశ్రమలో 143 మంది ఉన్నారు.. ప్రమాదంపై అత్యున్నత కమిటీతో విచారణ జరిపిస్తాం.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. మృతులు, గాయపడిన వారి పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.. ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక సమాచారం మా దగ్గర ఉంది.. విచారణ జరిగి నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తాం అని తెలిపారు.
Also Read:Modi:మోదీ విదేశీ పర్యటన ఖరారు

