ది అమెరికా పార్టీ అనే పేరుతో కొత్త పార్టీ పెడుతానని తెలిపారు ఎలాన్ మస్క్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఎలాన్ మస్క్. ట్రంప్ కొత్తగా ప్రవేశపెట్టిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు ఎలాన్ మస్క్.
ఈ బిల్లు టెక్ సంస్థలపై నియంత్రణ, అభిప్రాయ స్వేచ్ఛపై ఆంక్షలు, సోషల్ మీడియా స్వేచ్ఛను హరిస్తే చర్యలు తీసుకునే విధంగా రూపొందించారని మండిపడ్డారు మస్క్.
ఈ బిల్లు ప్రజల హక్కులను హరించేలా ఉందని, బిల్లు ఆమోదం పొందితే దేశ ప్రజల భవిష్యత్తు ముప్పులో పడుతుందని మండిపడ్డారు మస్క్. ఈ బిల్లు ఆమోదం పొందిన మరుసటి రోజే ‘ది అమెరికా పార్టీ’ అనే కొత్త పార్టీని పెడుతానని చెప్పారు. అమెరికా ప్రజలకు డెమోక్రటిక్ – రిపబ్లికన్ యూని పార్టీలకు ప్రత్యామ్నాయ పార్టీ కావాలని అభిప్రాయపడ్డారు మస్క్.
Also Read:పెరిగిన రైల్వే ఛార్జీలు


