బీసీ రిజర్వేషన్లు..ప్రధాని చేతుల్లోనే:రేవంత్

6
- Advertisement -

మోదీ చేతుల్లోనే బీసీ రిజర్వేషన్ నిర్ణయం ఉంది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన రేవంత్… స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయడానికి పది రోజులు చాలు అన్నారు. కోర్టు తీర్పు మేరకు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తాం అన్నారు.

42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ కమిట్మెంట్ నిరూపించుకున్నాం… మా చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేరు అన్నారు. మా పోరాటం కేంద్రంపై కాబట్టి జంతర్ మంతర్ వద్ద మా గొంతు వినిపించాం … కేసీఆర్ ఆర్డినెన్స్ తెచ్చారు కాబట్టి సవరించిన ముసాయిదా గవర్నర్ కి పంపాం అన్నారు.

రాష్ట్రపతికి రాజకీయాలకు సంబంధం లేదు… మోదీ చేతుల్లో రాష్ట్రపతి ఉన్నారా అదైనా చెప్పండి అన్నారు.

Also Read:సినీ కార్మికుల సమ్మె..అప్‌డేట్

- Advertisement -