సినీ కార్మికుల సమ్మె..అప్‌డేట్

4
- Advertisement -

సినీ కార్మికుల సమ్మె నాలుగో రోజుకు చేరగా ఈరోజు ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలు ఫెడరేషన్ సభ్యుల మధ్య కీలక చర్చలు జరిగాయి. చర్చలు తరువాత మధ్యాహ్నం ఎఫ్ డి సి చెర్మెన్ దిల్ రాజు ను కలవనున్నారు ఫెడరేషన్ సభ్యులు. మంత్రి కోమటిరెడ్డి ని, చిరంజీవి ని కలుస్తామని చెప్పారు ఫెడరేషన్ నాయకులు.

చిరంజీవి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతున్నారు.

సినీ కార్మికుల ప్రధాన డిమాండ్స్ రెండు.
1.కార్మికుల వేతనాలు పెంచాలి.
2.పెంచిన వేతనాలు ఏరోజు కారోజే ఇవ్వాలి అని చెపుతున్న ఫెడరేషన్ సభ్యులు.

నేడు జరిగే చర్చల్లో నిర్మాతలు పెట్టిన రూల్స్ సవివరంగా తెలుసుకొని డిసైడ్ అవుతామని చెబుతున్నారు ఫెడరేషన్ సభ్యులు. నిర్మాత విశ్వ ప్రసాద్ ఇక్కడ స్కిల్స్ లేవు అని చెప్పడం దుర్మార్గం అని మండిపడుతున్నారు. నిన్న బాలకృష్ణ,సి కళ్యాణ్ తో భేటి అయ్యారు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు. నేడు జరిగే చర్చలతో కార్మికుల సమ్మె పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నారు నిర్మాతలు , ఫెడరేషన్ సభ్యులు.

Also Read:మగ్గాలతో అద్భుత సృష్టి..నేతన్నల సొంతం

- Advertisement -