కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు:సీఎం రేవంత్

30
- Advertisement -

రేషన్ కార్డులు లేనివారు ప్రజాపాలన దరఖాస్తు ఇచ్చినా తీసుకుంటామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ఫామ్‌ను విడుదల చేశారు రేవంత్. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. రేషన్ కార్డు లేదని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదన్నారు. రేషన్ కార్డు లేకుండా పథకాలు అమలు చేయడం కష్టమన్న సీఎం.. కొత్త రేషన్ కార్డులను సైతం జారీ చేస్తామన్నారు.

డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. ప్రజలు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడానికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామన్న రేవంత్.. ఏ సమస్య ఉందని చెప్పినా విజ్ఞాపన పత్రాలు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. అలాగే ప్రజాపాలన దరఖాస్తులను జనవరి ఆరో తేదీ లోపు గ్రామ పంచాయతీల్లో అందించలేకపోతే.. ఎమ్మార్వో, ఎండీవో కార్యాలయాల్లో తర్వాత కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు.

Also Read:చక్కెర అధికంగా తింటే క్యాన్సర్ ముప్పు!

- Advertisement -