పాదాల పగుళ్లను..నివారించండిలా!

28
- Advertisement -

వింటర్ సీజన్ వచ్చిందంటే కొన్ని రకాల చర్మ సమస్యలు చుట్టుముట్టడం సర్వసాధారణం. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా చర్మం పొడిపరడం, పగుళ్లు ఏర్పడడం వంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా చాలమందికి పాదాలపై పగుళ్లు అధికంగా ఏర్పడుతుంటాయి. ఇవి ఏర్పడడం వల్ల తీవ్రమైన నొప్పితో నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు కొందరు. అంతేకాకుండా ఈ పగుళ్ల నుంచి రక్తస్రావం జరిగి తీవ్రమైన ఇన్ఫెక్షన్ కు దారి తీస్తుంది. అందువల్ల చాలమంది ఈ వింటర్ సీజన్ లో పగుళ్ల నుంచి విముక్తి పొందేందుకు మెడిసిన్స్ వాడటం, మార్కెట్ లో దొరికే రకరకాల క్రీమ్స్ వాడడం చేస్తుంటారు. అయితే పాదాలపై పగుళ్లను సహజసిద్ధంగానే తగ్గించుకోవచ్చు అదెలాగో చూద్దాం..!

శీతాకాలంలో చర్మ సంరక్షణకు కొబ్బరి నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. అందువల్ల పాదాల పగుళ్ళకు కొబ్బరి నూనె రాసి.. ఒక పదిహేను నిమిషాలు మర్దన చేసి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే పగుళ్లను చాలావరకు నివారించవచ్చు. ఇంకా గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి ఆ నీటిలో పాదాలను 20 నుముషాల పాటు ఉంచడం ద్వారా పగుళ్ల నొప్పి తగ్గుతుంది.

ఇంకా ఇలాగే ప్రతిరోజూ చేయడం వల్ల పగుళ్ల నుంచి విముక్తి పొందవచ్చు. చర్మ సంరక్షణలో తేనె యాంటీ బయోటిక్ గా ఉపయోగపడుతుంది. తేనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి పాదాల పగుళ్ళకు రాస్తే.. త్వరగా వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ చిట్కాలతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా తప్పక పాటించాలి. పగుళ్ళకు వ్యాజిలిన్ రాయడం, సౌకర్యవంతమైన చెప్పులు దరించడం, ప్రతిరోజూ పాదాలను శుబ్రంగా ఉంచుకోవడం వంటివి పాటిస్తే వింటర్ సీజన్ లో పాదాల పగుళ్లను త్వరగా అరికట్టవచ్చు.

Also Read:గోవింద కోటి పుస్త‌కాలు ఆవిష్క‌రణ..

- Advertisement -