సీఎం ఆఫీస్ నుంచి గంగుల కమలాకర్ కు ఫోన్..

648
Gangula-Kamalakar
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నేడు సాయంత్రం 4గంటలకు జరుగనుంది. కొత్తగా ఆరుగురికి ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఈసందర్భంగా పలువురి పేర్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండగా అఫిషియల్ గా సాయంత్రం తెలియనుంది. ఇక మంత్రి వర్గ ప్రమాణస్వీకారానికి హాజరుకావాల్సిందిగా సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి పలువురు ఎమ్మెల్యేలకు ఫోన్లు వెళ్లాయి.

కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి ఫోన్ చేశారు. సాయంత్రం జరిగే మంత్రి వర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాలని తెలియజేశారు. దీంతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెంటనే తన కుటుంబ సభ్యులతో హైదరాబాద్ బయలు దేరారు.

గంగుల కమలాకర్ 1968 మే 8వ తేదిన జన్మించారు. మల్లయ్య లక్ష్మీ నర్సమ్మ దంపతులు ఆయనకు జన్మనిచ్చారు. ఆయన బీటెక్ లో సివిల్ ఇంజనీరింగ్ చేశారు. ఆయనకు ఇక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. 2000 సంవత్సరంలో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2000 నుంచి 2005 సంవత్సరం వరకు ఆయన కౌన్సిలర్ గా పనిచేశారు. ఆ తర్వాత 2005 నుంచి 2009 వరకు కార్పొరేటర్ గా సేవలందించారు. ఆ తర్వాత 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటివలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడో సారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు.

- Advertisement -