సీబీఐ దర్యాప్తుకు సహకరిస్తాం: కేజ్రీవాల్

77
kejriwal
- Advertisement -

ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియో ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వ‌హిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తును స్వాగతిస్తున్నట్లు తెలిపారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేజ్రీవాల్..ద‌ర్యాప్తు సంస్థ‌కు పూర్తిగా స‌హ‌క‌రించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ విచార‌ణ ద్వారా ఏమీ బ‌య‌ట‌కురాదు అని ఆయ‌న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో సుమారు 20 ప్రాంతాల్లో సోదాల‌ను నిర్వ‌హిస్తున్నారు.

ఢిల్లీలో స్కూళ్ల అభివృద్ధి కోసం సిసోడియా ఎంతో చేశార‌ని, ఢిల్లీ ఎడ్యుకేష‌న్ మోడ‌ల్‌ను ప్ర‌శంసిస్తూ అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ ప‌త్రిక‌లో ఇవాళ ఫ్రంట్ పేజీలో క‌థ‌నం ప్ర‌చురించగా అదేరోజు సీబీఐ దర్యాప్తు జరగడం విశేషం.

ఢిల్లీ ప్ర‌భుత్వం ఇటీవ‌ల కొత్త ఎక్సైజ్ పాల‌సీని ఉప‌సంహ‌రించుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ విధానం అమ‌లులో భారీ అక్ర‌మాలు చోటుచేసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు రాగా కేజ్రీ సర్కార్ వెనక్కి తగ్గింది.

- Advertisement -