Harish:సీఎం కేసీఆర్ పాలన స్వర్ణయుగం

54
- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో సీఎం కేసీఆర్ పాలన స్వర్ణయుగమని మంత్రి హరీష్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని అన్నారు. గాంధీ భవన్‌లో కూర్చుంటే కాంగ్రెస్ వాళ్లకు అర్థంకాదని ఊర్లోకి వచ్చి అవ్వ తాతలను అడిగితే తెలుస్తుందని చురకలు అంటించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేటలో నిర్వహించిన సంక్షేమ ఉత్సవాలకు మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగాఆ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ…తెలంగాణలో తప్ప బీడీ కార్మికులకు ఏ రాష్ట్రంలో ఫించన్లు ఇస్తున్నారా అని అన్నారు. సంపదను పెంచి పేదలకు పంచుతున్నారని అన్నారు. పెద్దకొడుకులా వృద్ధులకు పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 12లక్షల 71వేల మంది ఆడబిడ్డలకు మేనమామలా పెండ్లి చేశారని అన్నారు. ఆసరా పెన్షన్లు ఈ తొమ్మిదేండ్ల కాలంలో 59వేల కోట్లు అందించామని అన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి సురక్షిత మంచి నీళ్లు ఇస్తున్నామని వెల్లడించారు. నేరుగా పొయ్యి దగ్గరకే తాగునీరు వస్తున్నదని స్పష్టం చేశారు.

Also Read: “ఆపరేషన్.. అపోజిషన్ ” కే‌సి‌ఆర్ వ్యూహం!

సిద్దిపేటను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చామని తెలిపారు. ఇప్పటివరకు 12రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేశామని అన్నారు. సిద్దిపేటలో ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం పోటీ ఏర్పడిందన్నారు. గడిచిన తొమ్మిదేండ్ల కాలంలో 21మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని అన్నారు. వైద్య కళాశాలలు తెచ్చామని బీజేపీ నాయకులు అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్‌ కరీంనగర్‌కు మెడికల్ కాలేజీ తెచ్చాడా అని ప్రశ్నించారు. అబద్ధాల బీజేపీ నాయకులకు చిత్తశుద్ది ఉంటే విభజన హామీలను అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ బీజేపీ నాయకులవి నరం లేని నాలుకలని మండిపడ్డారు.

Also Read: బీసీల్లోని వృత్తికులాలకు ఆర్థికసాయం..

- Advertisement -