ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ..

195
kcr
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఈ రోజు నుంచి జరుపుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా కుదేలైపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను 1991లో సంస్కరణలను చేపట్టి పీవీ నరసింహారావు గాడిలో పెట్టారని ప్రధానికి గుర్తు సీఎం చేశారు. భరతమాత ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి, అనేక ఇతర రంగాల్లో సైతం ఆయన విశిష్ట సేవలు అందించారని ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.

విద్యారంగంలో పీవీ తెచ్చిన సంస్కరణలు విప్లవాత్మకం. అప్పటి సమైక్యరాష్ట్రంలో ఆయన ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు, ఆతరువాత జాతీయస్థాయిలో ఏర్పాటు చేసిన నవోదయ పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లోని పేద, చురుకైన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాయి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయనికి మాజీ ప్రధాని పీవీ నరసింహరావు పేరు పెట్టాలనేది స్థానిక తెలంగాణ ప్రజల డిమాండ్ అని ప్రధానికి లేఖ ద్వారా తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్.

తెలంగాణా విద్యా వ్యవస్థలో అసమానతల నేపథ్యంలో తలెత్తిన ఉద్యమంతో, సమస్య పరిష్కారానికి 1974లో సిక్స్ పాయింట్ ఫార్ములాలో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రారంభమైందని ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ తెలిపారు. పీవీ నరసింహారావు శతజయంతి సందర్భాన్ని పురస్కరించుకొని సెంట్రల్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టి ఘన నివాళి అర్పించాలని ప్రధాని నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖలో కోరారు.

- Advertisement -