విద్యుత్ ఒకప్పుడు సమస్యగా.. ఇప్పుడు సౌకార్యంగా..

278
harish rao
- Advertisement -

ఆదివారం సిద్దిపేట జిల్లాలో విద్యుత్ డివిజన్ నూతన కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగంలో విప్లవాత్మక మైన మార్పులు వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ రంగంలో గొప్ప మార్పులు తెచ్చారని మంత్రి తెలిపారు. విద్యుత్ ఒకప్పుడు సమస్యగా ఉండేది..ఇప్పుడు సౌకార్యంగా మారింది. కిందిస్థాయి నుండి సీఎండీ స్థాయి వరకు ట్రాన్స్‌కో అధికారులు గొప్పగా పనిచేయడం వల్లే ఇది సాధ్యమయ్యిందన్నారు.

సిద్ధిపేటలో 1 కోటి రూపాయల వ్యయంతో ట్రాన్స్‌కో డీఈ కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించాం. కొడకండ్ల వద్ద ఉన్న 400 కేవీ సబ్ స్టేషన్ నుండి సిద్ధిపేట 220 కేవీ సబ్ స్టేషన్ కు 40 కోట్ల రూపాయలతో ప్రత్యేక లైన్‌ను వేస్తున్నామని మంత్రి అన్నారు. ఈ లైన్‌తో వోల్టేజ్ సమస్య ఉండదు. సిద్ధిపేట జిల్లాలో రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రాజెక్టుల నిర్మాణం జరిగి 3440 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణాలు జరిగాయి.గతంలో విద్యుత్ కార్యాలయాలన్నీ అద్దె భవనాల్లో ఉండేవి.ఇప్పుడు అన్ని సొంత భవనాలు నిర్మించుకున్నామని హరీష్‌ పేర్కొన్నారు.

- Advertisement -