సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం పర్యటన షెడ్యూల్‌..

135
kcr cm

తెలంగాణ సీఎం కేసీఆర్‌ర్‌ గురువారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పర్యటించనున్నారు. కాళేశ్వరంపై అధికారులతో ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో సమీక్షించనున్నారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ వరకు కేసీఆర్‌ ఏరియల్‌ సర్వే చేయననున్నారు. మూడో టిఎంసికు సంబంధించిన పంప్‌హౌస్‌లను పరిశీలించనున్నారు. కాళేశ్వరం పంప్‌హౌస్‌ల పనితీరు. కాళేశ్వరం పురోగతి వంటి పలు అంశాలపై అధికారులతో సమీక్ష జరుపనున్నారు.

సీఎం కేసీఆర్‌ పర్యటన వివరాలు..

సీఎం కేసీఆర్‌ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌ నుండి బుధవారం రాత్రి 7.45కి బయల్దేరి 10 గంటల వరకు కరీంనగర్‌ తీగలగుట్టపల్లికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి అక్కడి నుండి గురువారం ఉదయం 8.50 కి కరీంనగర్‌ కలెక్టరేట్‌ చేరుకొని అక్కడి నుండి 9.గంటలకు హెలీకాప్టర్‌లో బయలుదేరి కళేశ్వరం చేరుకుంటారు. అక్కడి నుండి 9.35 రోడ్డు మార్గంలో కాళేశ్వరం చేరుకొని దేవాలయాన్ని సందర్శించి, కాళేశ్వర ముక్తేశ్వుర స్వామిని దర్శింకుంటారు సీఎం. అనంతరం గోదావరి ఘట్‌ను సందర్శించనున్నారు.

అనంతరం 10.10 నిమిషాలకు దేవాలయం నుండి రోడ్డు మార్గంలో హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుని అక్కడి నుండి 10.15కు భూపాలపల్లి చేరుకుంటారు. అక్కడి నుండి 10.20 కి హెలీకాప్టర్‌లో బయలుదేరి 10.30 నిమిషాలకు అంబాట్‌ గ్రామంలోని లక్షీ బ్యారేజ్‌ను సీఎం పరిశీలిస్తారు.

అనంతరం మధ్యహ్నాం ఓంటి గంటకు లంచ్‌ చేసి అక్కడి నుండి 2గంటలకు హెలీకాప్టర్‌లో బయలుదేరి భూపాలపల్లి చేరుకుంటారు. అక్కడి నుండి 2.25కు హెలీకాప్టర్‌లో కరీంనగర్‌ కలెక్టరేట్‌కు చేరుకొని అక్కడి నుండి 2.30కి రోడ్డు మార్గంలో బయలుదేరి తిరిగి 2.40 కి తీగలగట్టుపల్లికి అథితి గృహానికి చేరుకుంటారు. అక్కడ సీఎం కేసీఆర్‌ అధికారులతో సమీక్షించి సాయంత్రం ప్రగతిభవన్‌కు చేరుకుంటారు.

KCR's Kaleshwaram Tour

KCR's Kaleshwaram Tour