నాని ‘వి’ టీజర్ కు ముహుర్తం ఖరారు

339
v movie Teaser
- Advertisement -

నేచురల్ స్టార్ నాని సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం వి. మోహనకృష్ణ ఇంద్రగంటి ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈమూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈమూవీ టీజర్ విడుదలపై క్లారిటీ ఇచ్చారు చిత్రయూనిట్.

ఈనెల 17న వి మూవీ టీజర్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ లకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో నాని సీరియల్ కిల్లర్ గా కనిపించనున్నాడు. ఆయన పాత్రను కూడా ‘రాక్షసుడు’ అంటూనే పరిచయం చేశారు. ఇక ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రను సుధీర్ బాబు పోషించాడు. ‘రక్షకుడు’ అంటూ అయన పాత్రను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. నాని సరసన నివేధా ధామస్, సుధీర్ బాబు సరసన అదితీరావు హైదరీలు నటించారు. ఉగాది పండుగ సందర్భంగా మార్చి 25న ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -