బీజేపీ సీనియర్ నేత సుష్మ స్వరాజ్ మృతితో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్,రాజకీయాలకు అతీతంగా సుష్మా స్వరాజ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సుష్మా స్వరాజ్ హఠాన్మరణంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Hon'ble CM Sri K. Chandrashekar Rao conveyed his condolences over the demise of former Union Minister Smt. Sushma Swaraj Ji. CM praised the services she rendered for the nation in different capacities. CM expressed his condolences to the members of bereaved family.
— Telangana CMO (@TelanganaCMO) August 6, 2019
సీఎం కేసీఆర్ సుష్మా మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిగా సుష్మా దేశానికి అందించిన సేవల్ని కొనియాడారు. ఆమె మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని.. ఆమె కుటుంబానికి ధైర్యం ఇవ్వాలన్నారు సీఎం.
అపార అనుభవం, సంయమనం, రాజకీయ నైపుణ్యం కలబోసిన నాయకురాలు సుష్మా అని కొనియాడారు ఏపీ సీఎం జగన్. రాజకీయాలకు అతీతంగా మనన్నలందుకున్న గొప్ప పార్లమెంటేరియన్ అని ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Shocked by the sudden demise of #SushmaSwaraj ji. A national stalwart and a towering personality who was loved across party lines. As an able administrator and an epitome of bravery & kindness, she inspired women of this country. My Condolences to her family.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 6, 2019
వివిధ హోదాల్లో దేశానికి సుష్మా చేసిన సేవల్ని ఎప్పటికీ మర్చిపోలేమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. విదేశాంగ మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారని.. ఆ పనితీరు ఆదర్శవంతమైనదన్నారు.
Shocked to hear about the sudden demise of BJP leader Sushma Swaraj Ji. Her contribution to the nation in various leadership roles will never be forgotten. Her stellar work as MEA will be looked upon as an exemplary model of governance. I pray God to give strength to the family pic.twitter.com/V241dX5sON
— N Chandrababu Naidu (@ncbn) August 6, 2019