సుష్మా…కోట్లాది మందికి స్పూర్తి:మోడీ,రాహుల్

627
modi sushma swaraj
- Advertisement -

బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ హఠాన్మరణంతో దేశం యావత్తు దిగ్బ్రాంతికి గురవుతోంది. రాజకీయాలకు అతీతంగా సుష్మాతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురవుతున్నారు. సుష్మా స్వరాజ్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలు సంతాపం తెలిపారు.

భారత రాజకీయాల్లో ఒక ఉజ్వల అధ్యాయం ముగిసిందంటూ ప్రధాని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. సుష్మాజీ అస్తమయం చెందడం వ్యక్తిగతంగా తనకు ఎంతో లోటు. దేశానికి ఆమె చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు. సుష్మాను అభిమానించే వారికి ఇది ఎంతో దురదృష్టకరమైన పరిస్థితి. నా ఆలోచనలన్నీ సుష్మా కుటుంబసభ్యులతోనే ఉంటాయి అని మోడీ పేర్కొన్నారు.

దేశం కోసం సుష్మా చేసిన ప్రతి పనిని ప్రజలు గుర్తించుకుంటారు. సుష్మా స్వరాజ్‌ కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారు అని కొనియాడారు. జీవితాంతం తాను నమ్మిన సిద్ధాంతాల కోసమే పనిచేశారని … బీజేపీ కోసం ఆమె ఎంతో చేశారని తెలిపారు మోడీ.

సుష్మా స్వరాజ్ ఇకలేరనే వార్తతో తాను షాక్‌కు గురయ్యాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. రాజకీయాల్లో ఆమె అనితరసాధ్యురాలని కొనియాడారు. ఆమెకు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -