ఈ రోజు కోసమే ఎదురుచూశా…సుష్మా చివరి ట్వీట్

349
sushma swaraj twitter

బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ హఠాన్మారణంతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. మంగళవారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. సుష్మా మృతితో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి.

బీజేపీ నేతగా అటు పార్టీలో కేంద్రమంత్రిగా ప్రభుత్వంలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సుష్మా స్వరాజ్‌. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి స్పందించే ఆమె చనిపోవడానికి కొద్ది గంటల ముందు కూడా ట్వీట్ చేశారు.

ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ట్విట్టర్‌ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ఇది చూడటం కోసమే జీవితకాలం ఎదురు చూశానని ఆమె ట్వీట్ చేశారు. కానీ ఊహించని రీతిలో ఇదే ఆమె చేసిన చివరి ట్వీట్ అయ్యింది.