ఐదోసారి సీఎంగా నవీన్ ..సీఎం కేసీఆర్ విషెస్

265
kcr naveen patnaik
- Advertisement -

రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న బిజూ జనతా దళ్ పార్టీకే ఒడిశా ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. అసెంబ్లీ పలితాల్లో బీజేడీ వైపు మొగ్గుచూపిన ఓటర్లు లోక్ సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ వైపు ఆసక్తికనబర్చారు. ఈ నేపథ్యంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్.

మొత్తం 147 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఒడిశాలో 99 స్థానాల్లో బీజేడీలో ముందంజంలో ఉంది. ఇప్పటికే నాలుగు సార్లు పూర్తికాలం పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన నవీన్.. ఐదోసారి ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమేనని తెలుస్తోంది.

మొత్తం 21 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేడీ 20 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. బీజేపీ కేవలం ఒకే స్థానంలో పరిమితమైంది. కాగా ఈ ఎన్నికల్లో బీజేపీ 14 స్థానాల్లో ముందంజలో ఉండగా బీజేడీ కేవలం 7 స్థానాల్లో ప్రభావం చూపిస్తోంది.

- Advertisement -